Breaking News

రైలు పట్టాలపై సిలిండర్‌.. బయటపడిన మరో కుట్ర

Published on Sun, 09/22/2024 - 11:11

కాన్పూర్‌: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.

కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్‌పీఎఫ్‌కి, డిపార్ట్‌మెంట్‌లోని ఇతర అధికారులకు తెలియజేశారు.

ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ ​​పీఆర్‌వో అమిత్‌ సింగ్‌కు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్‌- పూణె స్పెషల్‌ రైలు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)