Breaking News

‘నేతలు గోల్‌గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా

Published on Thu, 07/18/2024 - 13:11

బాలీవుడ్‌ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె  జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్‌)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్  కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు  మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.

కంగనా తన సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్‌గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య  హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)