Breaking News

హైకోర్టుకు కమల్‌ హాసన్‌.. ‘థగ్‌లైఫ్‌’ సినిమాను అడ్డుకొని తీరుతాం

Published on Mon, 06/02/2025 - 16:37

సాక్షి,బెంగళూరు: కన్నడ భాషా వివాదంపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టును (karanataka high court) ఆశ్రయించారు. ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ‘థగ్‌లైఫ్‌’ (Thug Life) సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జూన్‌ 5న ఈ సినిమా విడుదల ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.  

ఈ క్రమంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ ఎం.నరసింహులు కమల్‌ హాసన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. కన్నడ భాషనే కాదు, రాష్ట్రాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్‌ హాసన్‌ కన్నడ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

‘కమల్‌ హాసన్‌ (kamal hasan) క్షమాపణలు చెప్పాలనేది సినిమా ఇండస్ట్రీ కోసం కాదు.. రాష్ట్రం కోసం. కమల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ రాజకీయ,కన్నడ అనుకూల సంస్థలు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పాయి. క్షమాపణలు చెప్పకుండా థగ్‌ లైఫ్‌ సినిమాను విడుదల చేస్తామంటే తాము ఒప్పుకోబోమని, అడ్డంకులు సృష్టించామని సూచించారు. రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడం లేదు. క్షమాపణలు చెప్పకుండా థగ్‌లైఫ్‌ ఎలా విడుదల చేస్తామో మేమూ చూస్తాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.

తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్‌ హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, కన్నడ భాషను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్‌ తన వ్యాఖ్యలకు క్షమాణలు చెప్పాలని కోరారు. ఆ విజ్ఞప్తులపై కమల్‌ హాసన్‌ స్పందిస్తూ బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయొద్దని నొక్కాణించారు. ఈ తరుణంలో థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల కోసం కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు