Breaking News

సామాజిక విప్లవ వీరుడు

Published on Fri, 11/28/2025 - 08:02

Jyotirao Phule Death Anniversary 19వ శతాబ్దంలో జ్యోతిరావు ఫూలే సమకాలీన కుల, లింగ వివక్ష లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మొత్తం భారత సామాజిక చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా నిలిచింది. 1827లో మహా రాష్ట్రలో గోవిందరావు, చిన్నాబాయి దంపతులకు జన్మించిన ఫూలే  విద్యార్థిగా ఉన్నప్పుడు ‘అమెరికా స్వతంత్ర ఉద్యమం’, ‘శివాజీ జీవిత చరిత్ర’, థామస్‌ పెయిన్‌ రచన ‘మానవుని హక్కులు’, జాన్‌ స్టువర్ట్‌ రాసిన ‘స్వతంత్రం’ వంటివి ప్రభావితం చేశాయి. 

ఫూలే జీవితంలో ఒక అసాధారణ సంఘటన, ఆయన భవి ష్యత్‌ జీవితాన్ని సామాజిక సేవకు అంకితమయ్యేటట్లుగా మార్చింది. తన బ్రాహ్మణ మిత్రుని ఆహ్వానం మేరకు అతడి పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు బ్రాహ్మణులు ఫూలేను పక్కకు నెట్టివేసి కులం పేరుతో దూషించారు. ‘శూద్రుడివి ఈ ఊరేగింపులో పాల్గొనడానికి ఎంత ధైర్యం?’ అని అవమానించారు. ఈ అవమానం గురించి తన తండ్రికి వివరించాడు. తండ్రి కొడుకును బుజ్జగిస్తూ... పీష్వాల పాలనలో ఇది మామూలే అని చెప్పాడు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి శూద్రులు విద్యావంతులు అవ్వడం ఒక్కటే మార్గమని ఆయన భావించారు. ఉన్నత కులాలకు సంబంధించిన సామాజిక సమస్యలైన సతీసహగమనం వంటి ఆచారాలనూ ఆయన వ్యతిరేకించారు. భర్త మరణించిన స్త్రీలు, అనాథ బాలల పునరావాసానికి అంకితభావంతో పనిచేశారు. స్త్రీ విద్యకోసం పాఠశాలలను ఏర్పాటు చేశారు. తన భార్య సావిత్రీబాయికి తనే చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తయారు చేసి, ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. 

ఫూలే తన సంస్థల నిర్వహణకు అవసరమైన ఆదాయ ఆర్జనకు కొంత కాలం క్వారీ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అర్జీలను, విన్నపాలను బ్రిటిష్‌ గవర్నమెంట్‌కు సమర్పించారు. అమాయకు లైన కార్మికులను చైతన్యవంతులుగా మార్చడానికి వారికి అర్థమయ్యే భాషలో క్వారీల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలను రాశారు.  ‘సత్యశోధక సమాజ్‌’ అనే సంస్థను 1873లో స్థాపించి దాని ద్వారానే శూద్రులకు విద్యను అందించడానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సమాజ సేవకు మెచ్చిన ప్రజలు ‘మహాత్మా’ అనే బిరుదునిచ్చారు. ఆ అవిశ్రాంత పోరాట యోధుడి స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోనిది.
– కిరణ్‌ ముదిరాజ్‌ ‘ హైదరాబాద్‌
(నేడు జ్యోతిబా ఫూలే వర్ధంతి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)