CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!

Published on Sun, 08/11/2024 - 05:18

చండీగఢ్‌: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆవేదన వెలిబుచ్చారు. 

ముఖ్యంగా ప్రైవేట్‌ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు.

 శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్‌ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. 

టెక్నాలజీ వాడకం పెరగాలి 
టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్‌ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.
 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)