Breaking News

జార్ఖండ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు

Published on Sun, 09/22/2024 - 06:04

సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మామిడన్న సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రామచంద్రరావును జార్ఖండ్‌ హైకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బదిలీ చేశారు. అలాగే మరికొందరు న్యాయమూర్తులను ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశీ్మర్‌–లడఖ్, మద్రాస్‌ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. మరో ముగ్గురు జ్యుడీíÙయల్‌ అధికారులను మద్రాస్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.

ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు... 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021 ఆగస్టు 31న తెలంగాణ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.

2021 అక్టోబర్‌ 12న పంజాబ్‌–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అనంతరం 2023 మే 30న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రరావు తండ్రి జస్టిస్‌ ఎం.జగన్నాథరావు 1997–2000 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)