Breaking News

బంగ్లాను ఖాళీ చేయడానికి  సిద్ధంగా ఉన్నాం 

Published on Tue, 07/08/2025 - 05:45

న్యూఢిల్లీ: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సోమవారం తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన అద్దె బంగ్లాకు ఇప్పటికే కొంత సామాను కూడా పంపించామన్నారు. మిగతాది కూడా ప్యాకింగ్‌ పూర్తి చేసి స్టోర్‌ రూంలో ఉంచామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని ఐదో నంబర్‌ బంగ్లాలో చంద్రచూడ్‌ దంపతులు దివ్యాంగులైన ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నారు. అయితే, అనుమతించిన సమయానికి మించి ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. 

ఈ అంశం వివాదాస్పదం కావడం తనకెంతో విచారం కలిగించిందన్నారు. ‘నా కుమార్తెలు ప్రియాంక, మహిలు నెమాలిన్‌ మయోపతి అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో కూడా వారిని అత్యంత పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఉంచాల్సి ఉంది. వారికోసం ప్రత్యేకంగా నర్సును ఏర్పాటు చేశాం. వారిని వీల్‌చైర్‌లో తిప్పేందుకు అనువుగా ఉండే ఇల్లు ఎంతో అవసరం. పెయిన్, స్పీచ్‌ థెరపీతోపాటు వారికి నిత్యం చెస్ట్, రెస్పిరేటరీ, న్యూరలాజికల్‌ థెరపీనీ చేయించాల్సి ఉంటుంది. కొత్త ఇల్లు సిద్ధమైందని చెప్పిన వెంటనే ఖాళీ చేస్తాం..అందుకు రెండు రోజులు, రెండు వారాలు కూడా పట్టొచ్చు..’అని చంద్రచూడ్‌ చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)