హత్రాస్‌ బాబాకు క్లీన్‌ చిట్‌

Published on Sat, 02/22/2025 - 05:56

హత్రాస్‌: హత్రాస్‌లో 121 మంది ప్రాణాలను బలి తీసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆధ్యాత్మిక గురువు నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలె బాబాకు న్యాయ విచారణ కమిటీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. గతేడాది జులై 2వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం రిటైర్డు జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ్‌ సారథ్యంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భోలె బాబా అసలు పేరు సూరజ్‌పాల్‌. అయితే, పోలీసులు నిందితుడి జాబితాలో సూరజ్‌పాల్‌ పేరును చేర్చలేదు. దర్యాప్తు సమయంలో గతేడాది అక్టోబర్‌లో కమిషన్‌ ఎదుట భోలె బాబా హాజరయ్యారు. 

ఈ కమిటీ భోలెబాబాకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ నివేదిక అందజేసిందని ఆయన లాయర్‌ ఏపీ సింగ్‌ వెల్లడించారు. కొందరు కుట్రదారులు భోలె బాబాను, యూపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా వారి ఎత్తుగడలను కమిషన్‌ బయటపెట్టిందన్నారు. ఇది సత్యానికి, విశ్వాసానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. తొక్కిసలాట చోటుచేసుకున్న తర్వాత కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు ప్రకాశ్‌ మధుకర్‌ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జిని, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే అనుమతివ్వగా 2.50 లక్షల మందికి పైగా భక్తులు రావడంతోనే ఘోరం జరిగిందని యంత్రాంగం వాదించింది. కాగా, ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)