Breaking News

హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి

Published on Thu, 08/03/2023 - 11:58

హర్యానాలోని నూహ్‌ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్‌ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్‌, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి.

సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్‌ జిల్లా అడిషనల్‌ చీఫ్‌ జస్టిస్‌ అంజలి జైన్‌.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్‌ సియారమ్‌తో  కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్‌ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు.
చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం

కారుపై రాళ్లతో  దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు. 

దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్‌ చంద్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. 
చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)