Breaking News

జడ్జి నోట్ల కట్టల వ్యవహారం.. గోప్యంగానే ఆ లేఖ!

Published on Mon, 05/26/2025 - 16:12

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ(yashwant varma) ‘నోట్ల కట్టల’ వ్యవహారంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదికను బహిర్గతం చేయడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్‌ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న టైంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. మంటలర్పిన ఫైర్‌, పోలీస్‌ పోలీస్‌ సిబ్బందికి కాలిన  నోట్ల కట్టలు కనిపించడం, ఆ వ్యవహారం బయటకు పొక్కడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కోర్టు నియమించిన కమిటీ విచారణ జరిపి నివేదికను అందజేసింది కూడా. అయితే.. 

అందులో విషయాలను బహిర్గతం చేయాలంటూ ఆర్టీఐ వ్యవస్థ ద్వారా న్యాయస్థాన సమాచార అధికారికి దరఖాస్తు అందింది. అయితే సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌(CPIO) ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ.. ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్‌ 8(1)(e) కింద సమాచారం అందించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 2019 సంచలన తీర్పును న్యాయస్థానం ప్రస్తావించింది. సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ కేసులో.. రాజ్యాంగ పరిధిలో గోప్యత హక్కు, సమాచార హక్కు ఈ రెండింటి సమతుల్యత అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది.

మార్చి 14వ తేదీన జడ్జి ఊళ్లో లేని టైంలో బంగ్లాలో ఫైర్‌ యాక్సిడెంట్‌ చోటు చేసుకుని కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఆయన్ని అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే అలహాబాద్‌ బార్‌ అసోషియేషన్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. బదిలీ చేసినప్పటికీ విధులేవీ ఆయనకు అప్పగించలేదు. 

అంతేకాదు.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టల ఫొటోలు, వీడియోలను సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అటుపై మార్చి 22వ తేదీన జడ్జి వర్మ నోట్ల కట్టల వ్యవహారంపై అంతర్గత విచారణకు ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మే 3వ తేదీన తుది నివేదిక రూపొందించగా.. ఆ మరుసటి రోజు ఆనాడు సీజేఐగా ఉన్న సంజీవ్‌ ఖన్నాకు నివేదిక అందజేసింది.  దానిని సీజేఐ ఓ లేఖ ద్వారా రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి తెలియజేశారు. మరోవైపు తనపై వస్తున్నవి కేవలం ఆరోపణలేనని జస్టిస్‌ వర్మ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)