Breaking News

‘జమిలి’ బిల్లులపై ఉత్కంఠ

Published on Wed, 12/18/2024 - 20:27

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్‌​ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్‌ 19) లోక్‌సభలో స్పీకర్‌ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారంతో పార్లమెంట్‌ సెషన్‌ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్‌ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.

అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్‌ ఛాంబర్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

అయితే బీజేపీ లార్జెస్ట్‌ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్‌ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్‌లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)