Breaking News

కామ్రేడ్‌.. రెడ్‌ సెల్యూట్‌

Published on Sat, 09/14/2024 - 05:30

సాక్షి, న్యూఢిల్లీ:  ‘జోహార్‌ కామ్రేడ్‌ ఏచూరి, వుయ్‌ సెల్యూట్, ఉద్యమాల రహదారి ఏచూరి, మీ మరణంతో మా గుండెలు ఆగాయి, రెడ్‌ సెల్యూట్‌ కామ్రే డ్, కామ్రేడ్‌ ఏచూరి మమ్మల్ని విడిచి వెళ్లావా, తూ ర్పున ఎర్రని సూర్యుడా.. మా సీతారాం ఏచూరి..’అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) దద్దరిల్లింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పారి్థవ దేహాన్ని శుక్రవారం సాయంత్రం విద్యార్థుల సందర్శనార్థం జేఏన్‌యూకి తరలించా రు. ఏచూరి భౌతిక కాయాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భావోద్వేగంతో నినాదాలు చేస్తూ ఘన నివాళులరి్పంచారు. అనంతరం 6 గంటల సమయంలో జోరువానలో జేఎన్‌యూ నుంచి వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర ప్రముఖులు నివాళులరి్పంచారు. 

భార్య సీమ ఛిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను ఓదార్చారు. బీజీపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌చార్జి (ఎన్‌ఎస్‌యూఐ) కన్హయ్య కుమార్‌ తదితరులు ఘన నివాళులర్పించారు.  

నేటి మధ్యాహ్నం ఎయిమ్స్‌కు పారి్థవ దేహం 
శనివారం ఉదయం 8 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం, అనంతరం ఓ గంట పాటు విదేశాల నుంచి వచి్చన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులరి్పంచేందుకు వీలుగా అక్కడ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)