Breaking News

జియో రెండు ఆఫర్లు.. ఒకే రూపాయి తేడా!

Published on Sun, 09/01/2024 - 10:43

న్యూఢిల్లీ: ఇప్పుడున్న రోజుల్లో రూపాయికి ఏమొస్తుందని ఎవరినైనా అడిగితే చాక్లెట్‌ కూడా కష్టమే అని అంటారు. అయితే జియో సంస్థ కేవలం రూపాయికి ఎంతో తేడా చూపింది. మరింత విలువను ఆపాదించింది. వినడానికి వింతగానే ఉన్నా దీని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 448, రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిశీలిస్తే రూపాయి విలువెంతో అర్థం అవుతుంది. కేవలం రూపాయి తేడాతో జియో ఎంత మ్యాజిక్‌ చేసిందో ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రెండు ప్లాన్‌లను అందిస్తోంది. వీటిలో ఒక ప్లాన్ ధర రూ.448 కాగా, మరొక ప్లాన్‌ ధర రూ.449. దీనిని వినగానే ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్‌లు ఎందుకని మనకు అనిపిస్తుంది. పైగా చూసేందుకు ఈ రెండు ప్లాన్‌లు ఒకే విధంగా కనిపిస్తాయి.

అయితే ఆ రెండు ప్లాన్‌ల వివరాలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కంపెనీ 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అయితే డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్‌లో 56 జీబీ డేటా  ఉంటుంది. దీనిలో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో  ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను  ఉంటుంది. అలాగే జియో టీవీ యాప్‌, సోని లివ్‌, జీ5, లైన్‌గాటా ప్లే, డిస్కవరీ ప్లస్‌, సన్‌ నెక్స్‌ట్‌, కన్చా లాంకా, ప్లానెట్‌ మరాఠీ, చౌపాల్‌, ఫన్‌ కోడ్‌, హోయ్‌చోయ్‌ మొదలైన వినోద వేదికల్లో సబ్‌స్క్రిప్షన్  జతచేరుతుంది.

ఇక రిలయన్స్ జియో రూ. 449 ప్లాన్‌ విషయానికొస్తే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు. అయితే ఇందులో 84 జీబీ డేటా ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుతుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం కూడా  జతచేరుతుంది.  అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్నాక ఈ రెండు ప్లాన్‌ల మధ్య తేడా ఇంత ఉందా అని అనిపిస్తుంది.

ప్రతిరోజూ ఎక్కువ డేటా వినియోగం అవసరమయ్యే వారు రూ. 449 ప్లాన్‌ తీసుకోవచ్చు. దీనిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఫోనులో ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే మరింత వినోదాన్ని కోరుకునేవారు రూ. 448 ప్లాన్‌ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో వివిధ వినోద మాధ్యమాల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి... ఒక్క రూపాయిని జియో ఎంత పవర్‌ఫుల్‌గా మార్చిందో..

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)