Breaking News

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Published on Sat, 04/29/2023 - 07:45

ఢిల్లీ: జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఉదయం ఫలితాల్ని రిలీజ్‌ చేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) తన అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 

ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్‌ ఫలితల కోసం రీవాల్యూయేషన్‌, రీ చెకింగ్‌ లాంటివి ఉండవని, కాబట్టి అభ్యర్థులు సంప్రదించేందుకు ప్రయత్నించకూడదని సూచించింది ఎన్‌టీఏ. 

రిజల్ట్‌ చెక్‌ చేసుకునేందుకు.. స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు..  https://jeemain.nta.nic.in/  వీక్షించొచ్చు. 

జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 1 పరీక్ష జనవరిలో జరిగింది. ఏప్రిల్‌ 6 నుంచి 15 రెండో విడత జరిగాయి. మొదటి విడత పరీక్షకు 8.24 లక్షల మంది, రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. 

ఈ రెండుసార్లు పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన అభ్యర్థుల ఉత్తమ స్కోర్‌ ఆధారంగానే ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి.. మొత్తం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. 

ఈ నెల 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 7వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్‌ ఫీజును మే 8వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్‌ 4వ తేదీన ఉంటుంది.  ఉదయం 9-12గం. పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య రెండో పేపర్‌ ఉంటుంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)