Breaking News

'కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు'.. సొంత పార్టీ నేతపై జేడీయూ అసహనం!

Published on Mon, 05/29/2023 - 16:36

పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ హరివంశ నారాయణ్‌ సింగ్ హాజరవడాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి గైర్హాజరైన కార్యక్రమానికి డిప్యూటి ఛైర్మన్ వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు.

'జర్నలిజం కోటాలో డిప్యూటీ ఛైర్మన్ పదవికి హరివంశ నారాయణ్‌ సింగ్ పేరును జేడీయూనే ప్రతిపాదించింది.  అలాంటప్పుడు ప్రతిపక్షాలకు అండగా ఉండకుండా.. కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు' అని నీరజ్ కుమార్ దుయ్యబట్టారు.

పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూతో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే హరివంశ నారాయణ్‌ సింగ్ జేడీయూకు చెందిన నేత. జర్నలిస్టుల కోటాలో భాగంగా రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ కు జేడీయూనే అప్పట్లో ప్రతిపాదించింది. దీంతో తమ సొంత పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి.. డిప్యూటి ఛైర్మన్ హోదాలో హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు.

హరివంశ నారాయణ్ సింగ్ 2018లో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవి చేపట్టారు. డిప్యూటి ఛైర్మన్‌గా కాంగ్రెస్‍కు చెందని మూడో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు.

ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్‌ భవనంపై లాలు యాదవ్‌ పార్టీ వివాదాస్పద ట్వీట్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)