Breaking News

జంతర్‌ మంతర్‌ నిరసనల కాలక్రమం

Published on Sun, 07/26/2026 - 01:55

జూన్‌ 6, 2026: జంతర్‌ మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు షురూ! 

⇒ ప్రధాన డిమాండ్‌: నీట్‌ యూజీ–2026 పేపర్‌ లీక్, సీబీఎస్‌ఈ ఆన్‌‑ స్క్రీన్ మార్కింగ్‌ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.  

జూన్‌ 28, 2026: సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష మొదలు. దేశవ్యాప్తంగా అందరి, ముఖ్యంగా జెన్‌–జీ దృష్టిని ఆకర్షించిన ఘట్టమిది. 
⇒ భారతదేశం నలుమూలల నుంచి సీజేపీ ఉద్యమానికి సంఘీభావం. వెల్లువలా జంతర్‌మంతర్‌కు జెన్‌–జీ.  

జూలై 18, 2026: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్‌ భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు జూలై 21న మెదాంత ఆసుపత్రికి తీసుకెళ్లేందకు అనుమతిచి్చంది.  

జూలై 20, 2026: చలో సంసద్‌ ర్యాలీ సందర్భంగా జంతర్‌ మంతర్‌ వద్ద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. మహిళలు సహా పలువురు విద్యార్థులకు గాయాలు. కొంతమందిపై పెల్లెట్‌ గన్‌ ప్రయోగం. జంతర్‌ మంతర్‌ చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాల మోహరింపు.  

జూలై 23, 2026 (రాత్రంతా జాగరణ): గాయాలు, అలసట ఉన్నప్పటికీ విద్యార్థులు నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఆటలు, పాటలతో సందడిగా రాత్రంతా సందడిగా మారింది జంతర్‌ మంతర్‌. 

⇒  దేశం నలుమూలల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎందరో ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార పానీయాలు పంపించడం, కుర్రాళ్ల విన్యాసాలతో ఆ రాత్రి నిరసన కార్యక్రమాల్లో కొంగొత్త వైఖరిని ఆవిష్కరించింది. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న కొందరికి స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారం, నీరు, మందులు పంపిణీ చేశారు; ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగించేందుకు విసనకర్రలతో వారికి సపర్యలు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  
⇒ నిరసనకారులు రాక్‌స్టార్‌ సినిమాలోని ‘‘సడ్డా హక్‌’’తోపాటు చాలా సినిమా పాటలను ఉత్సాహంగా పాడి, ఆడారు. నినాదాలు రాత్రంతా మారుమోగాయి. 

జూలై 24, 2026: కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నేత జితేంద్ర సింగ్‌ మెదాంత ఆసుపత్రిలో సోనమ్‌ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన్‌ రాజీనామా మినహా మిగిలిన షరతులకు రాతపూర్వక అంగీకారం తెలపడంతో ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నట్లు సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రకటించారు. 
జూలై 25, 2026: పేపర్‌ లీక్‌పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా. 
⇒  నిరసనకారులు దీనిని పాక్షిక విజయంగా ప్రకటించారు, కానీ పరీక్షల నిర్వహణ. పారదర్శకతపై మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)