Breaking News

శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?

Published on Sat, 08/24/2024 - 12:00

జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి  అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.

కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్‌ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్  మొదలైన సేవలు  ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)