Breaking News

Cinema Controversy: పేరులోనే అంతా ఉంది!

Published on Mon, 06/23/2025 - 13:04

ఎల్లలు దాటేసిన భారతీయ సినిమా.. సొంతగడ్డపైనే చిక్కులు ఎదుర్కొంటోంది!. ‘‘ఆ పేరులో ఏముంది లే?’’ అని అనుకోవడానికి ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఆ పేరే ఇప్పుడు సినిమాకు అడ్డం పడుతోంది. జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ అనే సినిమాలో ‘జానకీ’ అనే పేరును మారిస్తేనే రిలీజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామంటోంది సెన్సార్‌ బోర్డు. మాలీవుడ్‌ స్టార్‌, బీజేపీ ఎంపీ.. కేంద్ర మంత్రి(సహాయ) సురేష్‌ గోపి ఈ చిత్రంలో కీ రోల్‌ పోషించడం ఇక్కడ మరో విశేషం.

సినిమాను దేశం అనే బౌండరీని దాటించి.. ఇంటర్నేషనల్‌ ఆడియొన్స్‌ను అలరించేందుకు మన ఫిల్మ్‌మేకర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోజులివి. ఫిక్షన్‌, బోల్డ్‌, ఒక్కోసారి సామాజిక అంశాలను స్పృశిస్తూ సక్సెస్‌ అవుతున్నారు. అయితే ఈ మసాలాలను అందరూ మెచ్చడం లేదు. రాజకీయ, మతపరమైన వర్గాల నుంచి ఒక్కోసారి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదీ పేర్ల విషయంలోనే కావడం మరో విశేషం. అలాంటి కొన్ని ‘సినిమా కష్టాల’ను ఓసారి గుర్తు చేసుకుందాం.

పద్మావత్‌
2017-2018లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన చిత్రం. సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో దీపికా పదుకొనే, రణ్‌ర్‌ సింగ్‌‌, షాహిద్‌కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్‌ ఫిక్షన్‌డ్రామా. అయితే కర్ణిసేన నుంచి తీవ్ర అభ్యంతరాలతో ఈ సినిమా విడుదల అనుమానమే అనుకున్నారంతా. చివరకు పద్మావత్‌గా పేరును మార్చేయడంతో పాటు పలు సీన్లకు కత్తెర వేయడంతో  విడుదలకు లైన్‌  క్లియర్‌ అయ్యింది.

ఎస్‌ దుర్గా
మలయాళంలో 2017లో రిలీజ్‌ అయిన చిత్రం. అయితే విడుదలకు ముందు ఈ చిత్రం సెక్సీ దుర్గ పేరుతో వివాదంలోకి ఎక్కింది. హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాతే ఈ పేరును ఎస్‌ దుర్గాగా మార్చడంతో విడుదలకు అనుమతించారు. రాజ్‌శ్రీ దేశ్‌పాండే, కన్నణ్‌ నాయర్ లీడ్‌ పాత్రల్లో మతాంతర వివాహంనేపథ్యంతో సనల్‌ కుమార్‌ శశిథరన్‌  ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

సత్యప్రేమ్‌ కీ కథ
సమీర్‌ విద్వాన్స్‌ డైరెక్షన్‌లో ..  కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీ జంటగా 2023లో రిలీజ్‌ అయిన చిత్రమిది. తొలుత ఈ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాకు సత్యనారాయణ కీ కథ అనుకున్నారు.అయితే దేవుడి పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం ముదరముందే పేరును మార్చేసి రిలీజ్‌ చేశారు.

జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ
ఇది తాజా కాంట్రవర్సీ. మలయాళ సీనియర్‌ హీరో సురేష్‌ గోపి ముఖ్యపాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. కోర్టు రూమ్‌ డ్రామాగా  ప్రవీన్‌ నారాయణన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో లీడ్‌ పాత్ర దాడికి గురయ్యే బాధితురాలు. జానకీ అంటే సీతాదేవి(శ్రీరాముడి భార్య)కి మరో పేరు అని, భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి పేరు మారిస్తేనే రిలీజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్పష్టం చేసింది. పైపెచ్చు ఈసినిమాకు ఇదివరకే 13+ సర్టిఫికెట్‌ను బోర్డు ఇష్యూ చేయడం గమనార్హం. ఇంతేకాదు..

రీసెంట్‌గా ఇలాగే ఓ మలయాళ సినిమాలో హీరోయిన్‌ పేరును జానకీ నుంచి జయంతిగా మార్చిన తర్వాతే రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యిందని కేరళ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జనరల‌ సెక్రటరీ  బీ ఉన్నికృష్ణన్‌ చెబుతున్నారు. అయితే అదేం చిత్రమో పేరును చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పై చిత్రాలే కాదు.. ఈ తరహా అభ్యంతరాల వివాదాలతో ార్పులుసంతరించుకున్న చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి.

అక్షయ్‌కుమార్‌ లీడ్‌ రోల్‌లో లారెన్స్‌ కాంచన రీమేక్‌గా  2020లో రిలీజ్‌ అయిన సినిమా. లక్ష్మీబాంబ్‌గా తొలుత టైటిల్‌ ఫిక్స్‌ చేయగా.. హిందూ సంఘాల అభ్యంతరాలతో లక్ష్మీగా మార్చేశారు. 2013లో సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన రామ్‌-లీలా.. అభ్యంతరాల తర్వాత గోలియోన్‌ కీ రాస్‌లీలా రామ్‌-లీలాగా టైటిల్‌ మార్చుకుంది. కిందటి ఏడాది మలయాళంలో రాహుల్‌ సదాశివన్‌ డైరెక్షన్‌లో వచ్చిన భ్రమయుగంలో లీడ్‌ రోల్‌ చేసిన సీనియర్‌ హీరో మమ్ముట్టి పేరు(కుంజామోన్‌ పోట్టి)పై  బ్రహ్మణ సంఘాల(కుంజామోన్‌ ఇళ్లం అనే వర్గం) నుంచి అభ్యంతరాలు వచ్చాయి. విషయం ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. దీంతో విడుదలకు ముందే కొడుమోన్‌ పోట్టిగా పేరును మార్చేశారు.

ఇవేకాదు.. కంగనా రనౌత్‌ తలైవి, అనుష్క రుద్రమదేవి, రిషబ్‌ శెట్టి కాంతార, సుదీప్తో తీసిన ది కేరళ స్టోరీ చిత్రాల విషయంలోనూ విడుదలకు ముందే పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే మేకర్ల క్లారిఫికేషన్‌ కారణంగా ఈ చిత్రాల విడుదలకు పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. సెన్సార్‌ బోర్డు తన కత్తెరకూ పదును పెట్టలేదు.  

🎬 సెన్సార్ బోర్డు (CBFC)కు ఏం హక్కు ఉంది?

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) భారత ప్రభుత్వంలోని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) పరిధిలో పనిచేస్తుంది. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఈ బోర్డు ఏర్పాటు చేయబడింది. సినిమా విడుదలకు ముందు CBFC నుండి సర్టిఫికేషన్ పొందడం తప్పనిసరి. ఈ బోర్డు సినిమాలకు U, UA, A, S వంటి సర్టిఫికేట్‌లను జారీ చేస్తారు.

సాధారణంగా.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు ఓ సినిమాగానీ, అందులోని పాత్ర పేరు మార్చించేసే చట్టపరమైన అధికారం నేరుగా లేదు. కానీ, తాము సూచించిన మార్పులకు గనుక దర్శన నిర్మాతలు అంగీకరించకపోతే సదరు చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపే అధికారం మాత్రం ఉంటుంది.

🧾 CBFC అధికారాలు

  • పేరు, సన్నివేశాలు, సంభాషణలు ద్వారా జాతిపరమైన లేదంటే మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందనుకుంటే, వారు సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.

  • పై విషయంలో  మార్పులకు సిఫార్సు చేయవచ్చు (ఇందులో పాత్ర పేరు, శీర్షిక, సంభాషణలవంటి అంశాలుంటాయి)

  • సర్టిఫికేట్ లేకుండా సినిమా విడుదల చేయటం చట్టవిరుద్ధం, కాబట్టి చాలా సందర్భాల్లో దర్శకులు సూచించిన మార్పులను అంగీకరిస్తారు.

🚫 CBFC చేతిలో లేనిది..

  • నేరుగా సినిమాగానీ, క్యారెక్టర్‌గానీ పేరు మార్చమని ఆదేశించడం. ఎందుకుంటే.. తుది నిర్ణయం ఆ సినిమా దర్శకనిర్మాతలదే.

  • CBFC యొక్క నిర్ణయాన్ని Film Certification Appellate Tribunal (FCAT) లేదంటే కోర్టుల్లో ఆ చిత్ర దర్శకనిర్మాతలు సవాల్‌ చేయొచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)