Breaking News

చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తే

Published on Wed, 07/15/2026 - 13:40

జమ్ముకశ్మీర్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం తన కుమారుడు కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం గుర్తుతెలియని మృతదేహం లభించిందని ఫోన్‌ రావడంతో ఆ కుటుంబం దానిని గుర్తించడానికి వెళ్లింది. అదే తమ వాని మృతదేహామే అని గుర్తించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సడెన్‌గా ఫోన్‌ వచ్చింది. మీ కుమారుడు బ్రతికే ఉన్నాడని తన మిత్రుడు ఫోన్‌ చేయడంతో అంతా కంగుతిన్నారు.

వివరాల్లోకి వెళితే 
సోహంజన నివాసి, ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 24 ఏళ్ల విశాల్ కుమార్, శనివారం డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అతని ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గుర్తుతెలియని మృతదేహం ఉందని ఫోన్ కాల్ రావడంతో ఆ కుటుంబం కంగారు పడి అక్కడికి వెళ్లింది.

కడుపుపై ​​మచ్చ, ఒక కంటికి అయిన గాయం విశాల్ ముఖ లక్షణాలను పోలి ఉండటంతో, అది అతనేనని బంధువులు భావించారు. తమ కుమారుడు చనిపోయాడని నిశ్చయించుకున్న వారు, దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే వారికి అనుకోని ఫోన్ కాల్ వచ్చింది. విశాల్ బతికే ఉన్నాడని, బారి బ్రాహ్మణ నుండి ఇంటికి వస్తున్నాడని అతని స్నేహితుడు తెలిపాడు.

దీంతో వారి కుటుంబసభ్యులు షాక్‌గురయ్యారు. కొద్ది క్షణాల తర్వాత, విశాల్ క్షేమంగా ఇంటికి తిరిగి రాగానే సంతోషంతో ఉబ్బితబ్బయిపోయారు. తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు, గుర్తుతెలియని ఆ మృతదేహాన్ని జీఎంసీ ఆసుపత్రికి తిరిగి అప్పగించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)