Breaking News

అంతా ఈయనే చేశారు...

Published on Wed, 01/29/2025 - 04:35

జేమ్స్‌ విల్సన్‌.. మనం బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడు ఈయనే తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు, తదనంతర పరిణామాల ఫలితంగా ఈస్టిండియా కంపెనీకి ఆర్థి కంగా చాలా నష్టం జరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యతను క్వీన్‌ విక్టోరియా స్కాట్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్‌ విల్సన్‌కు అప్పగించారు. అలా ఆమె ఆదేశం మేరకు విల్సన్‌ 1859లో భారత్‌కు వచ్చారు. 1860 ఏప్రిల్‌ 7న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

ఆ సమయంలో ఆయన మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను, లైసెన్స్‌ పన్ను, పొగాకు సుంకం.. ఇందులో ఆదాయపు పన్నును మాత్రమే అమల్లోకి తెచ్చారు. మిగిలినవాటిని పక్కనపెట్టారు. అయితే, భారత్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జమీందారులు, వ్యాపారవేత్తలు ఈ నిర్ణయంపై కినుక వహించారు. 

1793లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ అమల్లోకి తెచ్చిన శాశ్వత భూమి శిస్తు విధానం స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని అన్నారు. అప్పట్లో భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. అదనంగా ఆదాయపు పన్నును విధించడాన్ని విమర్శించారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. జేమ్స్‌ విల్సన్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 

దేశంలో భారతీయులు వ్యాపారం చేసుకునేందుకు బ్రిటిషర్లు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినందున ఆదాయంపై పన్ను విధించడం సబబే అని ఆయన వాదించారు. అయితే, బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొన్ని నెలలకే ఆగస్టులో రక్త విరోచనాలతో బాధపడుతూ జేమ్స్‌ విల్సన్‌ కోల్‌కతాలో మరణించారు.  

దేశంలో సివిల్‌ పోలీసు విభాగం ఏర్పాటు, తొలిసారిగా పేపర్‌ కరెన్సీ తేవడం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, ఆడిటింగ్, పబ్లిక్‌ వర్క్స్, రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, మిలటరీ ఫైనాన్స్‌ కమిషన్, సివిల్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ల ఏర్పాటు.. ఇలా అన్ని ఆయన కృషి ఫలితమే అని చెబుతారు.  

ప్రస్తుత స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ పూర్వ సంస్థ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు కూడా ఈయనే.. ఎలాగూ ఐటీ విషయం వచ్చింది కాబట్టి.. ఓ తాజా వార్త.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్‌ అనుకుంటున్నారట.. మేడమ్‌ వింటున్నారా? 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)