Breaking News

అది సీఎం ఆఫీస్‌.. లిక్కర్‌ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

Published on Sun, 03/24/2024 - 19:46

ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు.

‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. 

‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)