Breaking News

పారాషూట్‌ టెస్టు విజయవంతం

Published on Wed, 11/12/2025 - 05:44

బెంగళూరు: గగన్‌యాన్‌ యాత్రకు సంబంధించి కీలకమైన పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం ప్రకటించింది. భారత అంతరిక్ష యాత్రలో ఇదొక ముందుడుగు అని అభివర్ణించింది. ఈ నెల 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీలోని బబీనా ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌(బీఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్‌ కోసం పారాషూట్ల టెస్టు నిర్వహించామని ఇస్రో తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటిగ్రేటెట్‌ మెయిన్‌ పారాషూట్‌ ఎయిర్‌డ్రాప్‌ పరీక్షల(ఐమ్యాట్‌) శ్రేణిలో ఇదొక భాగమని ఒక ప్రకటనలో పేర్కొంది.

గగన్‌యాన్‌ మిషన్‌ కోసం పారాషూట్‌ వ్యవస్థ అర్హతను పరీక్షించమే వీటి ఉద్దేశమని స్పష్టంచేశారు. మొట్టమొదటి మానవ సహిత స్పేస్‌ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి పంపించడమే గగన్‌యాన్‌ యాత్ర లక్ష్యం. ముగ్గురు స్వదేశీ  వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. అనంతరం భూమిపైకి క్షేమంగా తిరిగివస్తారు. ఇది మొత్తం మూడు రోజుల యాత్ర. 

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో ఒక ప్రత్యేక లాంచ్‌ వెహికల్, ఆర్బిటాల్‌ మాడ్యూల్, క్రూ–ఎస్కేప్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఆయా పరికరాలు, వ్యవస్థలను పరీక్షించడానికి తొలుత మానవ రహిత యాత్రలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన తర్వాత మానవ సహిత యాత్ర జరుగుతుంది. గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్‌లోని పారాషూట్‌ సిస్టమ్‌లో నాలుగు రకాల పారాషూట్‌లు మొత్తం 10 ఉంటాయి.

వ్యోమగాములు భూమిపైన క్షేమంగా దిగడానికి ఇవి తోడ్పడుతాయి. తాజా పరీక్షలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్‌–76 విమానం ద్వారా పారాషూట్లను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, కిందికి జారవిడిచారు. ఎలాంటి లోపాలు లేకుండా షెడ్యూల్‌ ప్రకారం అవి భూమిపైకి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రోతోపాటు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్, డీఆర్‌డీఓ, భారత సైన్యం, వైమానిక దళం కూడా ఈ టెస్టులో పాల్గొన్నాయి.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)