Breaking News

‘సెంచరీ’కి షార్‌ సిద్ధం

Published on Wed, 01/29/2025 - 04:33

సూళ్లూరుపేట/తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు ప్రతిష్టాత్మక వందో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగానికి మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించింది. జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా 2,250 కిలోల బరువు కలిగిన నావిక్‌–02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.

మిగిలిన 89 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బుధవారం నాటి ప్రయోగంతో సెంచరీ మైలురాయిని దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. 50.9 మీటర్ల పొడవున్న జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ భూమి నుంచి నింగికి ఎగసే సమయంలో 420.7 టన్నులు బరువు కలిగి ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 19.17 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్‌–02 ఉపగ్రహాన్ని 170 కిలో మీటర్లు పెరిజీ(భూమికి అతి దగ్గరగా), 36,577 కిలో మీటర్లు అపోజి(భూమికి దూరంగా) జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ వారు తమ ఆ«దీనంలోకి తీసుకుని, ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే పనిని పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు.

జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 నమూనాకు ప్రత్యేక పూజలు
ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అంతరిక్షంలో భారత్‌ మరో మైలురాయిని చేరుకోవడానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగమైన జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ను రోదసిలోకి పంపనున్నామని చెప్పారు.

2025లో ఇదే మొదటి శాటిలైట్‌ ప్రయోగమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇప్పటికి 6 జనరేషన్‌ల రాకెట్లను విజయవంతంగా వినియోగించామని వివరించారు. మొత్తం 433 విదేశీ శాటిలైట్లను గగనతలంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టామన్నారు. నెక్ట్స్‌ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు. లో ఎర్త్‌ ఆర్బిట్‌లో 30 వేల కేజీల సామర్థ్యం కలిగి 1,000 టన్నుల బరువు ఉన్న లాంచింగ్‌ వెహికల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీహరికోటలో రూ.4,000 కోట్లతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మిస్తున్నామని, నాలుగు నెలల్లో ఇది పూర్తవుతుందని వి.నారాయణన్‌ వెల్లడించారు. 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)