Breaking News

డాకింగ్ సక్సెస్

Published on Thu, 01/16/2025 - 10:48

సూళ్లూరుపేట/ సాక్షి బెంగళూరు: సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో కలను సాకారం చేసేలా స్పేడెక్స్‌ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (డాకింగ్‌) విజయవంతమైంది. దీంతో ప్రపంచంలో డాకింగ్‌ సాంకేతికతను సాధించిన నాలుగోదేశంగా భారత్‌ అవతరించింది. అత్యంత క్లిష్టమైన డాకింగ్‌ను పూర్తిచేసి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. దీంతో నూతన సంవత్సరంలో ఇస్రో విజయాల బోణీ కొట్టింది. ఇంతకాలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్‌ను సాధించి ఇస్రో తన కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. ఈ  మిషన్ లో పాలు పంచుకున్న సిబ్బందికి నా శుభాకాంక్షలు. భారత భవిష్యత్‌ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ డాకింగ్‌ తొలిమెట్టు’’ అని మోదీ  హర్షం వ్యక్తం చేశారు.

గురువారం ఉదయం 9 గంటలకు చేజర్‌ (ఎస్‌డీఎక్స్‌01), టార్గెట్‌ (ఎస్‌డీఎక్స్‌02) అనే జంట ఉపగ్రహాలను అనుసంధానించామని, డాకింగ్‌ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్‌ చేస్తు న్నాం. త్వరలో మళ్లీ వీటిని దూరంగా విడగొడతాం. వీటి మధ్య ఇంధన, విద్యుత్‌ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షిస్తాం’’ అని ఇస్రో గురువారం ప్రకటించింది. ‘‘ అంతరిక్ష చరిత్రతో భారత్‌ తన పేరును ‘డాకింగ్‌’చేసింది. స్పేడెక్స్‌ మిషన్‌ ద్వారా చరిత్రాత్మక స్థాయిలో డాకింగ్‌ విజయవంతమైంది. ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్షిగా నిలిచినందుకు గర్విస్తున్నాం’’ అని ఇస్రో ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టింది. ఇస్రో తన డాకింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన స్పేడెక్స్‌ ప్రయోగం విజయవంతమవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘‘అద్భుత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ మిష

వైఫల్యాల నుంచి విజయం దాకా
గత ఏడాది డిసెంబర్‌ 30వ తేదీన పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ– సీ60) రాకెట్‌ ద్వారా స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌(స్పేడెక్స్‌) మిషన్‌ను చేపట్టారు. ఇందులోభాగంగా చెరో 220 కేజీల బరువైన చేజర్, టార్గెట్‌ ఉపగ్రహాలను ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు వృత్తాకార కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని నెమ్మదిగా ఒకే కక్ష్యలోకి తీసుకొచ్చారు. వాటిని అనుసంధానించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల్లో సారూప్యత లేకపోవడంతో డాకింగ్‌ సాధ్యంకాలేదు. 

చివరిసారిగా జనవరి 12వ తేదీన ఒకే కక్ష్యలో కేవలం 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. తర్వాత దూరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ మూడు మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. అయితే భూమ్మీది కమాండ్‌ సెంటర్‌ నుంచి స్పష్టంగా వీక్షించేందుకు సరిపడా వెలుతురు లేక, అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా డాకింగ్‌ను నిలిపేసి మళ్లీ వాటిని సురక్షిత దూరాలకు పంపేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రెండు ఉపగ్రహాలను అత్యంత కచ్చితత్వంతో ఒకదానికొకటి జోడించేందుకు మళ్లీ డాకింగ్‌కు ప్రయత్నించారు. 

టార్గెట్‌ ఉపగ్రహం నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్‌ ఉపగ్రహాన్ని తొలుత అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల సమీపానికి తెచ్చారు. లేజర్‌ రేంజ్‌ ఫైండర్, డాకింగ్‌ సెన్సార్లను ఉపయోగించి ఎట్టకేలకు చేజర్‌ ఉపగ్రహాన్ని టార్గెట్‌ ఉపగ్రహంతో డాకింగ్‌ చేశారు. భవిష్యత్తులో నిర్వహించబోయే చంద్రయాన్‌–4, గగన్‌యాన్‌ ప్రయోగాలకు కూడా ఈ డాకింగ్‌ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన స్పేడెక్స్‌ ప్రయోగం బృందానికి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ అభినందనలు తెలియజేశారు.

ఇస్రోకు వైఎస్‌ జగన్‌ అభినందనలు 
సాక్షి, అమరావతి: అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్‌ చేయ డం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ విజయంతో భవిష్యత్‌లో భారత్‌ చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు పడింది. ఈ సందర్భంగా ఇస్రోకు అభినందనలు’ అంటూ గురువారం సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు.  

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)