Breaking News

డిసెంబర్‌లో రోబోట్‌ సహిత అంతరిక్ష నౌక ప్రయోగం 

Published on Tue, 07/29/2025 - 04:51

సాక్షి, చెన్నై: రోబోట్‌తో కూడిన మొదటి అంతరిక్ష నౌకను డిసెంబర్‌లో ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీన  శ్రీహరి కోట నుంచి నాసా సహకారంతో ఇస్రో నిషార్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులోని ఎస్‌–బ్యాండ్‌ సింథటిక్‌ యాక్సిలేటర్‌ పూర్తిగా దేశీయంగా తయారు కాగా, మరో ఎల్‌బ్యాండ్‌ సింథటిక్‌ యాక్సిలేటర్‌ అమెరికాలో తయారైందని వివరించారు. సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌(ఎస్‌ఏఆర్‌) ఉపగ్రహం 24 గంటలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమికి సంబంధించి చక్కటి ఫొటోలను తీస్తుందన్నారు.

 సహజ వనరులు, కొండ చరియలు విరిగి పడే విపత్తులను గుర్తిస్తుందన్నారు. ఇది 12 రోజులకోసారి మొత్తం భూమి చిత్రాన్ని తీసి భారత్‌తోపాటు అన్ని దేశాలతో పంచుకుంటుందన్నారు. మానవ రహిత రోబోట్‌తో కూడిన అంతరిక్ష నౌకను శ్రీహరికోటలో సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్రపై దృష్టి పెట్టనున్నామన్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమోదం తెలిపారని, చంద్రయాన్‌ –4 పనులు చురుగ్గా జరుగుతున్నాయని, చంద్రయాన్‌–5 పైనా ఇక దృష్టి పెడుతామని నారాయణన్‌ పేర్కొన్నారు.  
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)