Breaking News

థ్రస్ట్‌ చాంబర్‌ మళ్లీ మండించారు

Published on Mon, 11/03/2025 - 05:58

సూళ్లూరుపేట:  ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌కు సంబంధించి దేశీయంగా అభివృద్ధి చేసిన సీ25 క్రయోజెనిక్‌ దశలో తొలిసారిగా కొత్త ప్రయోగం చేశారు. రాకెట్‌ నుంచి ఉపగ్రహం వేరుపడి కక్ష్యలోకి చేరిన తర్వాత రాకెట్‌లోని క్రయోజెనిక్‌ దశ థ్రస్ట్‌ చాంబర్‌ను మళ్లీ మండించినట్లు (రీఇగ్నైటెడ్‌) ఎల్‌వీఎం3 మిషన్‌ డైరెక్టర్‌ టి.విక్టర్‌ జోసెఫ్‌ చెప్పారు. ఇదొక కీలకమైన ప్రయోగమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరుగబోయే రాకెట్‌ ప్రయోగాల్లో బహుళ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు దోహదపడుతుందని వివరించారు.

 క్రయోజెనిక్‌ ఇంజన్‌ను మళ్లీ మండించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారని విక్టర్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 50 రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ఆదివారం తెలిపారు. మరో ఏడాది కాలంలో శ్రీహరికోటలో ఒక ప్రయోగ వేదిక, తమిళనాడులోని కులశేఖరపట్నంలో మరో ప్రయోగ వేదిక ఏర్పాటు చేసి ఏడాదికి కనీసం 10 ప్రయోగాలు చేస్తామని ఆయన చెప్పారు. 2026 మార్చి నెలలోగా ఏడు ప్రయోగాలను నిర్వహించనున్నామని స్పష్టంచేశారు.

ప్రధాని అభినందనలు  
సీఎంఎస్‌–03 శాటిలైట్‌ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలియజేశారు. మన అంతరిక్ష రంగం మనకు ఎంతో గర్వకారణమని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)