Breaking News

పీఎస్‌ఎల్‌వీ సీ–62 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌

Published on Sun, 01/11/2026 - 02:53

సూళ్లూరుపేట: సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌­లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ– 62 రాకెట్‌ ప్రయోగంతో 2026లో భారత్‌ శుభా­ర­ంభం చేస్తుంది. నాలుగు దశల రాకెట్‌ అనుసంధాన ప్ర­క్రియ పూర్తి చేసి ఎంఎస్‌టీ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వ­హించి ప్ర­యో­గ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బో­ర్డు­కు అప్ప­గించా­రు. అనంతరం లాంచ్‌ఆ«థరైజేషన్‌ సమావేశం నిర్వహించి ప్ర­యోగసమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయా­న్ని అధికారి­కంగా ప్రకటించారు. ఆదివారం మ«­ద్యా­హ్నం 12.17 గంటలకు కౌంట్‌డౌన్‌ నిర్వహించే­ందుకు సన్నాహాలు చేశారు. సోమవారం ఉద­యం 10.17 గంటలకు ప్రయోగం చేయనున్నట్టు ల్యా­బ్‌ చైర్మన్‌ ఈఎస్‌ పద్మకుమార్‌  ప్రకటించారు.  పీఎస్‌­ఎల్‌­వీ రాకెట్‌ సిరీస్‌లో ఈ ప్రయోగం 65వది కా­వ­డం విశేషం. పీఎస్‌ఎల్‌వీ–డీఎల్‌ అంటే రెండు స్ట్రాపాన్‌ బూ­స్టర్లు రాకెట్‌ వెర్షన్‌లో ఇది ఐదో ప్రయోగం. 

పీఎస్‌ఎల్‌వీ సీ–62 రాకెట్‌ వివరాలు 
పీఎస్‌ఎల్‌వీ సీ–62 రాకెట్‌ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరు­వు ఉంటుంది.  ప్రయోగంలో నాలుగుదశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. రాకెట్‌ మొదటి దశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్‌ అలోన్‌ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధనంతో 112.06 సెకెండ్లకు పూర్తి చేయనున్నారు. రాకెట్‌ దూసుకెళుతున్న తరుణంలోనే 107.86 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్‌షీల్డ్‌ విడిపోతాయి.

అంటే మొదటి దశ ప్రయాణ సమయంలోనే విడిపోతాయన్నమాట. అనంతరం 41.8 టన్నుల ద్రవ ఇంధనంతో 263.36 సెకెండ్ల రెండోదశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 494.72 సెకెండ్లకు మూడో దశ,  2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 984.62 సెకెండ్లకు నాలుగోదశను కటాఫ్‌ చేస్తారు. ఆ తర్వాత నాలుగోదశలో ద్రవ ఇంధన మోటార్‌తోనే 1074.62 సెకెండ్లకు (18.9 నిమిషాల్లో)  ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు.

ప్రత్యేకతలు ఇవీ 
ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన ఈవోఎస్‌–ఎన్‌1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలో మీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరో 10 సెకెండ్ల తర్వాత 14 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు. 
⇒ అనంతరం పీఎస్‌–4 దశను రీస్టార్ట్‌ చేసి స్పెయిన్‌దేశానికి చెందిన కిడ్‌ అనే పేలోడ్‌ను ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్‌ మహాసముద్రంలోకి పడేలా డిజైన్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)