Breaking News

29న షార్‌ నుంచి  వందో ప్రయోగం 

Published on Mon, 01/27/2025 - 05:05

సూళ్లూరుపేట: జీఎస్‌ఎల్‌వీ– ఎఫ్‌ 15తో ఎన్‌వీఎస్‌–02 ఉపగ్రహాన్ని అనుసంధానించడం పూర్తయిందని ఆదివారం షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ చెప్పారు. దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజనిక్‌ జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ ఎన్‌వీఎస్‌–02ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. శ్రీహరి కోటలోని షార్‌ నుంచి ఇది 100వ మిషన్‌ కానుందన్నారు. 

రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి చేపట్టే ప్రయోగంలో ఎన్‌వీఎస్‌–02ను జియో సిక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. జీఎస్‌ల్‌వీఎల్‌ ఎప్‌15 రాకెట్‌ ప్రయోగానికి 27 గంటల ముందు అంటే 28వ తేదీ తెల్లవారు జామున 3.23 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. 29న ఉదయం 6.23 గంటలకు ప్రయోగం ఉంటుందని చెప్పారు. అయితే, కౌంట్‌డౌన్‌ సమయాన్ని సోమవారం అధికారికంగా ఫ్రకటిస్తామని చెప్పారు.  

మూడో లాంచ్‌ప్యాడ్‌కు నెలలో శంకుస్థాపన 
సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌)లో మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3,984 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని రాజరాజన్‌ గుర్తు చేశారు. ఇందుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తయిందని, నెల రోజుల్లోనే భూమిపూజ ఉంటుందని వివరించారు. దీనికి అనుసంధానంగానే న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌ను రూపొందించనున్నామన్నారు. 

భవిష్యత్తులో దీనిద్వారానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపారు. కొత్త తరం లాంచింగ్‌ వెహికల్‌తో 20 నుంచి 25 టన్నుల ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి పంపించొచ్చని చెప్పారు. తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్న రాకెట్‌ ఫ్రయోగ వేదిక డిసెంబర్‌ 31 నాటికి పూర్తవుతుందన్నారు.  


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)