Breaking News

ఇస్రో శాస్త్రవేత్తలకు వర్క్‌షాపు

Published on Sun, 12/15/2024 - 06:15

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనలు, వాటి ఫలితాలు, సాకేంతికత, మెటీరియల్స్‌ మొదలగు వాటిని భారత ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై ఈనెల 11న అంతరిక్ష ప్రధానకేంద్రమైన బెంగళూరులో నిర్వహించామని శనివారం ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్, ఇన్‌స్పేస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పవన్‌ గోయెంకాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని 
విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇస్రో, ఇన్‌స్పేస్‌ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రాకెట్‌ పరికరాలు, ఉపగ్రహాలకు చెందిన పరికరాలను అందించే ప్రయివేట్‌ పార్టనర్స్‌ కూడా ఈ సెమినార్‌లో పాల్గొన్నాయి.

రోజు రోజుకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అప్‌డేట్‌ అవుతోంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాల్సి అవసరం వుందని ఈ రెండు సంస్థల ఛైర్మన్లు అన్నారు. ఆటోమోటివ్‌ రంగంలోని కెమెరా ఇమేజింగ్‌ సెన్సార్లు, ఉష్ణోగ్రత, పీడన సెన్సార్లు, అకౌస్టిక్, వైబ్రేషన్‌ సెన్సార్లు, గైరోస్కోప్‌లు, యాక్సిలరోమీటర్లు, ప్రత్యేకమైన పూతలు, అడ్హెసివ్‌లు, యాంటీ వైబ్రేషన్, నాయిస్‌ సప్రెషన్‌ టెక్నాలజీలు, ఇన్సులేషన్‌ టెక్నాలజీలు, భద్రతా వ్యవస్థలు అనే వాటిపై కూలకషంగా సెమినార్‌లో చర్చించారు.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ పారిశ్రామిక అనువర్తనాల కోసం భారత అంతరిక్ష కార్యక్రమం నుంచి జ్ఞానాన్ని బదిలీ చేయడం ప్రాముఖ్యత గురించి వివరించి మరీ చెప్పారు. స్పేస్‌–గ్రేడ్‌ టెక్నాలజీలు, వాహన భద్రత, పనితీరు స్థిరత్వాన్ని ఎలా మెరుగు పరుస్తాయో అన్వేషించమని ఆటోమోటివ్‌ పరిశ్రమలలోని వారికి సూచించారు. ఇన్‌స్పేస్‌ ఛైర్మన్‌ పవన్‌ గోయెంకా మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. వర్క్‌షాప్‌ద్వారా ఉత్పన్నమయ్యే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి వివరించారు. రాకెట్‌ ప్రయోగాల్లో వాణిజ్యపరమైన విస్తరణ కోసం ఆటోమోటివ్‌ పరిశ్రమలో కన్సార్టియం విధానం నేతృత్వంలో రాకెట్‌ పరికరాలను అందించే ప్రయివేట్‌ పార్టనర్లు పని చేయాల్సి వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో అన్ని సెంటర్లుకు శాస్త్రవేత్తలు, ప్రయివేట్‌ పార్టనర్లు పాల్గొన్నారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)