Breaking News

రోదసీలోకి మనిషిని పంపడంపై ఇస్రో దృష్టి

Published on Thu, 09/07/2023 - 06:04

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): రానున్న రెండు మూడేళ్లలో రోదసీలోకి వ్యోమగాములను పంపించి వారిని సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్‌యాన్‌–1(మ్యాన్‌ మిషన్‌) ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ మూడో వారంలో గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టంగా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

చంద్రుడిపై పరిశోధనలను విజయవంతంగా చేసిన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు గగన్‌యాన్‌ ప్రయో­గాన్ని నిర్వహించే పనిలో అనేక ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంటల్‌గా గగన్‌యాన్‌ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.

ఎల్‌వీఎం3 రాకెట్‌ ద్వారా 8,200 కిలోలు బరువున్న క్రూ మాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం పేరుతో ప్రయోగాన్ని నిర్వహించే యత్నం చేస్తున్నారు. 3.25 వెడల్పు, 3.58 పొడవుతో క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టంను రూపొందించారు. ఈ మాడ్యూల్‌ను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టి ఏడు రోజుల తర్వాత మళ్లీ కిందకు.. అంటే భూమికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రక్రియను నిర్వహిస్తారు.

చంద్రయాన్‌–3లో విక్రమ్‌ ల్యాండర్‌ను దిగిన చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రయత్నాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించడంతో, భవిష్యత్తులో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు చెప్పిన విషయం తెలిసిందే.

క్రూమాడ్యూల్‌ సిస్టంను కూడా లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి పంపి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్‌ విఫలమయ్యే పరిస్థితి సంభవిస్తే.. వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్థారించుకునేందుకు గగన్‌యాన్‌ ప్రయోగాత్మక ప్రయోగం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా రెండు ఎక్స్‌పెరిమెంటల్‌ ప్రయోగాలు చేశాక గగయాన్‌ సిరీస్‌లో మ్యాన్‌ మిషన్‌ ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో శాస్త్రవేత్తలంటున్నారు. వ్యోమగాములను రోదసీలోకి పంపి తిరిగి క్షేమంగా తీసుకురావడమే ఇస్రో ముందున్న లక్ష్యమని వారు చెబుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)