Breaking News

డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్‌ కావడంతో

Published on Tue, 07/25/2023 - 15:31

భువనేశ్వర్‌:  ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్‌ అయ్యింది.

దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్‌ డివిజన్‌లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్‌ సెక్షన్‌ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి   అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)