Breaking News

IRCTC: రూ. 24 వేలకే ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలివే..

Published on Mon, 09/08/2025 - 12:30

భారతీయ రైల్వే శివుని భక్తుల కోసం ఆధ్యాత్మిక యాత్రా అవకాశాన్ని అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ఇతర ప్రముఖ మతపరమైన ప్రదేశాలను కవర్ చేసే భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును నడుపుతున్నది.

నవంబర్ 18న యోగా సిటీ రిషికేశ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే 12 రోజుల ఈ తీర్థయాత్ర పర్యటన టిక్కెట్‌ ధర రూ. 24,100. ఈ రైలులో కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ తరగతులు ఉంటాయి. ఈ యాత్రలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, ద్వారకాధీష్ , బెట్ ద్వారకలను సందర్శించవచ్చు. అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదా అధీకృత అవుట్‌లెట్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ధరలు: కంఫర్ట్ (2AC) ఒక వ్యక్తికి రూ. 54,390, స్టాండర్డ్ (3AC) ఒక వ్యక్తికి రూ. 40,890 ఎకానమీ (స్లీపర్): ఒక వ్యక్తికి రూ. 24,100గా చార్జీలు ఉండనున్నాయి.  

భారత్ గౌరవ్ యోజన కింద ప్రయాణికులు 33 శాతం మేరకు టిక్కెట్‌ ధరలో తగ్గింపు పొందవచ్చు. బడ్జెట్ హోటళ్లలో వసతితో ఈ రైలు ప్రయాణం సాగనుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే) అందించనున్నారు. ప్రయాణ వ్యవధి: 11 రాత్రులు. టూర్‌ ప్రారంభ తేదీ: నవంబర్ 18, ముగింపు తేదీ: నవంబర్ 29. 767 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణించనుంది.  ప్రయాణికులు బోర్డింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే తమ గుర్తింపు రుజువుతో పాటు COVID-19 టీకా సర్టిఫికేట్ తీసుకెళ్లడం తప్పనిసరిని ఐఆర్‌సీటీసీ తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌