Breaking News

అయ్యప్ప భక్తులకు బీమా.. స్లాట్‌ బుకింగ్‌లో నామినీ అప్‌డేట్‌!

Published on Thu, 10/29/2026 - 13:03

శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు దేవస్థానం నుంచి కీలక సమాచారం అందింది. యాత్రలో ప్రమాదవశాత్తు మరణిస్తే బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా అందించే సదుపాయానికి సంబంధించిన పలు అప్‌డేట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలోనే నామినీ వివరాలు నమోదు చేసేలా ఆన్‌లైన్ విధానంలో మార్పులు చేశారు. దీనివల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా క్లెయిమ్ ప్రక్రియ సులభతరం కానుంది. ఈ సీజన్‌ నుంచి బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లో మార్పులు
శబరిమల యాత్ర కోసం అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో వర్చువల్ క్యూ స్లాట్ బుక్ చేసుకునే సమయంలో భక్తులు తమ నామినీ పేరు, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలకు బీమా పరిహారం అందించే ప్రక్రియలో ఇబ్బందులు తగ్గించడమే ఈ మార్పుల ఉద్దేశమని తెలుస్తోంది.

ప్రీమియం ఎంతంటే?
ఈ బీమా సదుపాయాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్నది.. బీమా ప్రీమియాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) భరిస్తుందని, భక్తులు ఐచ్ఛికంగా రూ.10లోపు చెల్లించి సదుపాయాన్ని పొందవచ్చని సమాచారం. అయితే బీమా పూర్తిగా ఉచితమా, అదనపు చెల్లింపు అవసరమా, పరిహారం పొందేందుకు వర్తించే షరతులు ఏమిటనే అంశాలను సంబంధిత అధికారిక మార్గదర్శకాల ద్వారా నిర్ధారించుకోవాలి.

ఏయే ప్రాంతాల్లో వర్తిస్తుంది?
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం పతనంతిట్ట, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల పరిధిలో జరిగే ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుందని తెలుస్తోంది. వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులతోపాటు స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని సమాచారం. అయితే బీమా పరిధి, ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలు, పరిహారం పొందేందుకు అవసరమైన పత్రాలపై స్పష్టత కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటనను పరిశీలించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)