Breaking News

9,000 హార్స్‌పవర్‌ రైలు ఇంజిన్‌ సిద్ధం.. ఎంత మాల్‌ లాగుతుందంటే..

Published on Sun, 03/02/2025 - 13:36

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways) దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అంటారు. దేశంలోని చాలామంది రైళ్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటు ప్రయాణికులను, ఇటు వస్తువులను తరలించేందుకు రైళ్లు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైల్వేలు ఒకవైపు ఆధునికత దిశగా పరిగెడుతూ, మరోవైపు ప్రయాణికులకు  అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. తాజాగా భారతీయ రైల్వే అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను రూపొందించింది. ఈ ఇంజిన్ వచ్చే నెలలో ట్రాక్‌లపై పరుగులు తీయనున్నదని సమాచారం.

ఈ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను గుజరాత్‌(Gujarat))లోని దాహోద్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ ఇంజిన్ తయారు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు. ఇక్కడ గూడ్స్ రైలు ఇంజన్లు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం మొదటి అత్యంత శక్తివంతమైన ఇంజిన్ సిద్ధం  అయ్యింది. ఈ రైల్వే కర్మాగారాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలో ఈ కర్మాగారం దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్‌ను నిర్మించి, ట్రాక్‌పైకి తీసుకువచ్చింది.

భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను 6000 హార్స్‌పవర్ నుండి 9000 హార్స్‌పవర్‌కు అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ గుజరాత్‌లోని దాహోద్‌లో రూ.20,000 కోట్ల  ఖరీదు చేసే 9,000 హార్స్ పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను తయారు చేయనుంది. 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్ 4,500 టన్నుల సరుకును మోసుకెళ్లే గూడ్స్ రైలును అధిక వేగంతో నడుపుతుంది. ఒక సాధారణ ట్రక్కు 7 నుండి 10 టన్నుల వస్తువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఈ నూతన ఇంజిన్లతో రైళ్ల వేగం గంటకు  50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు పెరగనుంది.

ఇది కూడా చదవండి: చెఫ్‌ అవతారంలో సోనూసూద్‌.. దోశ రేటు రెట్టింపు చేసి..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)