Breaking News

చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్‌ ప్రాజెక్ట్‌

Published on Tue, 07/30/2024 - 11:00

చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో  బోరెస్కోపిక్‌ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్‌ హాల్‌, ఆఫీసు, క్యాంటీన్‌లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.

బోరోస్కోపిక్ కెమెరా  అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని  ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్‌రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి.  అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)