Breaking News

‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..

Published on Wed, 02/21/2024 - 13:20

భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను  ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు.  తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. 

ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో  పాల్గొననున్నారు. 

భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్‌ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు  చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు  జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)