Breaking News

Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు

Published on Sun, 01/26/2025 - 09:58

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వేస్టేషన్లను అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు మురిసిపోతున్నారు.

అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ త్రివర్ణ పతాక కాంతిలో  వెలుగొందుతోంది. రామాలయ నిర్మాణం తర్వాత, దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు.

అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు.

ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. ఇక్కడికి విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. త్రివర్ణ పతాక కాంతిలో వారణాసి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనిపిస్తోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే స్టేషన్ పూర్తిగా త్రివర్ణ లైట్లతో అలంకరించారు. రైల్వే స్టేషన్ మొత్తాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల లైట్లతో అలంకరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక కాంతిలో ఝాన్సీ రైల్వే స్టేషన్ మిలమిలా మెరిసిపోతోంది.

ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సానాలోని రైల్వే స్టేషన్‌ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.

ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)