Breaking News

అప్పు.. అలా చేసేస్తున్నారు!

Published on Sun, 11/09/2025 - 01:08

భారతీయ కుటుంబాల అప్పులు పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. ఆస్తులను మించిన వేగంతో! రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం.. 2019–20తో పోలిస్తే 2024–25 నాటికి కుటుంబాల వార్షిక ఆస్తులు దాదాపు 48% అధికం అయ్యాయి. ఇదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా 104% పెరగడం గమనార్హం. కుటుంబాల పొదుపు, పెట్టుబడుల్లోనూ మార్పులు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా వేగంగా పెరుగుతోంది.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

సగటు భారతీయ కుటుంబం గత ఐదేళ్లలో పొదుపు, మదుపు చేయడం కంటే.. అప్పు చేస్తున్న వేగం పెరిగింది. ఆర్థిక ఆస్తులకు 2019–20లో భారతీయ కుటుంబాలు రూ.24.1 లక్షల కోట్లు జోడించాయి. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి 48% వృద్ధి చెంది రూ.35.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

మరోవైపు 2024–25లో కుటుంబాలకు రూ.15.7 లక్షల కోట్ల విలువైన రుణాల వంటి ఇతర ఆర్థిక బాధ్యతలు పెరిగాయి. వీటి విలువ 2019–20లో రూ.7.7 లక్షల కోట్లు. అంటే 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇవి రికార్డు స్థాయిలో 104% పెరిగిపోయాయన్నమాట. 

జీడీపీలో ఆస్తులు 10.8%
2019–20లో జోడించిన ఆర్థిక ఆస్తులు దేశ జీడీపీలో 12%గా ఉన్నాయి. ఇది 2024–25 నాటికి 10.8%కి తగ్గింది. అలాగే కుటుంబాల రుణ బాధ్యతలు 2019–20లో జీడీపీలో 3.9%గా ఉన్నాయి. 2023–24లో ఇవి ఏకంగా 6.2%కి ఎగబాకాయి. గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గి 4.7%కి చేరాయి. 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో..
కుటుంబాలు 2019–20లో జోడించిన మొత్తం ఆర్థిక ఆస్తుల్లో వాణిజ్య బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల వాటా 32 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది స్వల్పంగా పెరిగి 33.3%కి చేరింది. 2019–20లో కుటుంబాల డిపాజిట్ల పరిమాణం రూ.7.7 లక్షల కోట్లు. 5 ఏళ్లలో ఇది 54% అధికమై రూ.11.8 లక్షల కోట్లకు చేరుకుంది. 

ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అప్పట్లో మొత్తం ఆస్తుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వాటా కేవలం 2.6% మాత్రమే. కానీ గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 13.1%కి ఎగిసింది. 2019–20లో రూ.61,686 కోట్లుగా ఉన్న కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు.. 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 655% పెరిగి రూ.4.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)