Breaking News

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోయిస్టులు మృతి!

Published on Sat, 04/26/2025 - 11:51

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్‌ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు.  గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్‌లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్‌ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.

ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ‍్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ‍్క్షప్తి చేశారు.

గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)