Breaking News

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?

Published on Tue, 07/18/2023 - 20:10

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్‌ ఒకటే వేదికగా మారనుంది. 

15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్‌ 7.1 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 

వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్‌లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది.

ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)