Breaking News

ప్రత్యేక గడియారం ధరించనున్న వ్యోమగామి శుభాన్షు శుక్లా

Published on Thu, 05/22/2025 - 05:16

న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక గడియారాలను ధరించనున్నారు. శుభాన్షుతో సహా నలుగురు వ్యోమగాములు వీటిని ధరిస్తారని మిషన్‌ నిర్వాహక సంస్థ ఆక్సియమ్‌ స్పేస్‌ ధ్రువీకరించింది. ఒమేగా గడియారాలను మరోసారి రోదసీ యాత్రకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఈ గడియారాలను స్విట్జర్లాండ్‌కు చెందిన ఒమేగా సంస్థ తయారు చేసింది. 

ఈ ప్రత్యేక గడియారాలు మానవ అంతరిక్ష ప్రయాణంలో  తొలి రోజుల నుంచే భాగమయ్యాయి. నాసాతో ఒమేగా అనుబంధం 1960ల్లో ప్రారంభమైంది. మొదటిసారి స్పీడ్‌మాస్టర్‌ను అక్టోబర్‌ 3, 1962న మెర్క్యురీ సిగ్మా 7 మిషన్‌లో వ్యోమగామి వాలీ షిర్రా ధరించి వెళ్లారు. అయితే ఇది అనధికారికంగా ఉపయోగించారు. అప్పటికి నాసా ఇంకా ఆమోదించలేదు. 

1965 మార్చి 1న మానవసహిత మిషన్లలో ఉపయోగించడానికి నాసా ఒమేగా స్పీడ్‌మాస్టర్‌ను అధికారికంగా ధ్రువీకరించింది. దీనిని అపోలో మిషన్లలో విస్తృతంగా ఉపయోగించారు. అపోలో 11తో మొదటిసారి చంద్రునిపైనా కాలుపెట్టింది. నేటికీ వ్యోమగాములతో అంతరిక్షానికి వెళుతోంది. ఈ గడియారాలను గురుత్వాకర్షణ లేని పరిస్థితులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, అధిక పీడనం వరకు అంతరిక్షంలోని అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. శుక్లాతో సహా ప్రతి వ్యోమగామికి రెండు ఒమేగా స్పీడ్‌మాస్టర్‌ గడియారాలు అందుతాయి.  
 

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)