Breaking News

సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?

Published on Thu, 03/14/2024 - 07:59

ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్‌ యూనిట్‌లో 24 శునకాలు, ఉండగా, హాఫ్‌ యూనిట్‌లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం  ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్‌దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు  10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి.  అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్‌ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. 

సైన్యంలోని డాగ్ యూనిట్‌లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్‌లోని రీమౌంట్ అండ్‌ వెటర్నరీ కార్ప్స్ సెంటర్‌లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల  ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్‌కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?