Breaking News

చైనా, పాక్‌ సరిహద్దుల్లో హెరాన్‌ మార్క్‌–2 డ్రోన్లు మోహరింపు

Published on Mon, 08/14/2023 - 05:29

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి భారత వాయుసేన పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తిమంతమైన హెరాన్‌ మార్క్‌–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్‌ సరిహద్దు స్థావరాల్లో మోహరించింది. హెరన్‌ మార్క్‌–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థం్య కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ డ్రోన్ల మోహరింపుతో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ‘హెరాన్‌ మార్క్‌ 2 డ్రోన్లు అత్యంత శక్తిమంతమైనవి. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం, సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం కానుంది’ అని డ్రోన్‌ స్క్వాడ్రన్‌ వింగ్‌ కమాండర్‌ పంకజ్‌ రాణా చెప్పారు.

ప్రత్యేకతలు ఇవీ
► ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్‌ మార్క్‌–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు.
► డ్రోన్లలో ఉండే లేజర్‌ సుదూర ప్రాంతంలో ఉండే శత్రు దేశాల లక్ష్యాలను గుర్తించగలవు. దీంతో మన క్షిపణులు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది.
► ఎంత దూరంలోనున్న లక్ష్యాలనైనా గుర్తించడం, సుదీర్ఘంగా గాల్లో ఎగిరే సామర్థ్యం ఉండడం వల్ల ఇవి ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగలవు.
► ఈ డ్రోన్లు ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉండడం వల్ల ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్‌ చేసే సదుపాయం ఉంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)