భారత వాయుసేనలోకి తేజస్‌

Published on Thu, 10/05/2023 - 05:30

సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్‌ఏఎల్‌ కృషిని ఆయన కొనియాడారు.

ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్‌ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్‌ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్‌. రెండు సీట్లు ఉండేలా డిజైన్‌ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)