Breaking News

మన పొరుగున దుష్టులున్నారు 

Published on Sat, 01/03/2026 - 06:35

చెన్నై: మన పొరుగున దుష్టులున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌరులను కాపాడుకొనే హక్కు ప్రభుత్వానికి కచి్చతంగా ఉందని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించినంత కాలం నీటిలో మనల్ని వాటా అడిగే హక్కు పొరుగు దేశానికి లేదని స్పష్టంచేశారు. అదే సమయంలో మంచి పొరుగువాళ్లను మనం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. 

పెట్టుబడులు పెడతామని, వనరులు పంచుకుంటామని, అవసరమైన సాయం అందిస్తామని పేర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు 4 బిలియన్‌ డాలర్లు ఇచ్చామని గుర్తుచేశారు. మిత్రదేశాలకు కరోనా ఉధృతి సమయంలో వ్యాక్సిన్లు అందజేశామని వెల్లడించారు. ఇబ్బందుల్లో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు ఇంధనం, ఆహారం సరఫరా చేశామని తెలిపారు. శుక్రవారం ఐఐటీ–మద్రాసులో ఓ కార్యక్రమం సందర్భంగా జైశంకర్‌ మాట్లాడారు. 

‘‘దౌత్యం అంటే సులభంగా అర్థం కాని రాకెట్‌ సైన్స్‌ అనుకోవద్దు. అది కనీస విచక్షణా జ్ఞానానికి సంబంధించినది. మన పొరుగువాళ్లు మంచివాళ్లు, ఎవరికీ హాని తలపెట్టనివాళ్లు అయితే వారి పట్ల మన ప్రవర్తన దయతో కూడుకొని ఉంటుంది. వారికి సాయం అందించడానికి ఎలాంటి సంకోచం ఉండదు. అదే మన సహజ ప్రవృత్తి. ఒకవేళ పొరుగువాళ్లు చెడ్డవాళ్లు అయితే వారిపట్ల మన ప్రవర్తన కూడా సరిగ్గా అదే రీతిలో ఉంటుంది. మంచివాళ్లతో స్నేహ సంబంధాలు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాం. అవతలి వ్యక్తులు చెడ్డవాళ్లు అని తెలిసినప్పుడు స్నేహం చేయలేం. 

ఇప్పుడు మన పొరుగుదేశం పట్ల అలాగే వ్యవహరిస్తున్నాం’’అని జైశంకర్‌ స్పష్టంచేశారు.  పొరుగుదేశం మనపైకి ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులను ఎగదోస్తూ ఉంటే.. ఆ ముష్కర మూకల నుంచి మనల్ని పౌరుల్ని రక్షించుకొనే హక్కు మనకు ఉంది. ఆ హక్కును తప్పనిసరిగా వాడుకుంటాం. ఎలా వాడుకోవాలన్నది మన ఇష్టం. ఇతరులెవరూ మనల్ని నిర్దేశించలేరు. మనల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో మనకు తెలుసు.  కానీ, పొరుగు దేశం దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉంటే నీళ్లు పంచుకోవడం ఎలా సాధ్యం’’ అని ప్రశ్నించారు.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)