Breaking News

మిలియనీర్ కుటుంబాలు 8,71,700

Published on Sat, 09/20/2025 - 01:33

దేశంలో మిలియనీర్‌ కుటుంబాల (ఒక మిలియన్‌ డాలర్లు లేదా రూ.8.5 కోట్ల నికర విలువ ఉన్నవి) సంఖ్య కేవలం 4 ఏళ్లలో 90 శాతం పెరిగింది. 2021లో వీటి సంఖ్య 4,58,000 లక్షల నుంచి 2025లో ఏకంగా 8,71,700కు ఎగబాకింది. 2017– 2025 మధ్య మిలియనీర్‌ కుటుంబాల సంఖ్య ఏకంగా 445 శాతం పెరగడం విశేషం. 

దేశంలోని మొత్తం కుటుంబాల్లో.. ఇవి 0.31 శాతం. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధిక మిలియనీర్‌ కుటుంబాలతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటే.. నగరాల్లో ముంబై టాప్‌లో నిలిచింది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ‘మెర్సిడెజ్‌ బెంజ్‌ హురున్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌ 2025’లో వెల్లడయ్యాయి.- సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ప్రధాన కారణాలు
పట్టణ ఆర్థిక వృద్ధి, వ్యాపార ఆలోచనలు పెరగడం, బలమైన ఈక్విటీ మార్కెట్లు, టెక్నాలజీ, వివిధ రకాల పెట్టుబడి మార్గాలు వంటి అనేక కారణాలు మిలియనీర్‌ కుటుంబాలు పెరగడానికి దోహదం చేశాయి.

మరింత ధనికులుగా..
2017 నాటి మిలియనీర్లలో 2025 నాటికి రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినవారు 5 శాతం అంటే 66,800 కుటుంబాలు. రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది 1.3 శాతం. రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరింది 0.07 శాతం. రూ.8,500 కోట్ల క్లబ్‌ అంటే బిలియనీర్ల జాబితాలోకి చేరింది 0.01 శాతం.. అంటే 360 కుటుంబాలు.

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..
మిలియనీర్‌ కుటుంబాలు అంటే గతంలో ముంబై, ఢిల్లీ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం, జైపూర్, లక్నో వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ సంఖ్య పెరుగుతోంది.

ఆర్థిక స్వేచ్ఛ
‘మెర్సిడెజ్‌ బెంజ్‌ హురున్‌ ఇండియా లగ్జరీ కంజ్యూమర్‌ సర్వే’ ప్రకారం.. ఏటా పర్యటనలు, చదువు, వినోదం కోసం 60 శాతం మిలియనీర్‌ కుటుంబాలు 
రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నాయి.

⇒ ‘ఎంత సంపద ఉంటే ఆర్థిక స్వేచ్ఛ’ ఉన్నట్టు భావిస్తారు అని అడిగితే.. 27 శాతం మంది రూ.50 కోట్లు చాలు అని చెప్పారు. రూ.200 కోట్లు ఉండాల్సిందే అని 20 శాతం మంది స్పష్టం చేశారు.
⇒ 40 శాతం మంది ఒక కారును 6 ఏళ్లకుపైనే వాడుతున్నారు.
⇒ 27 శాతం మంది.. యోగా తమకు ఇష్టమైన ఫిట్‌నెస్‌ కార్యక్రమం అని చెప్పారు.
⇒ విదేశాల్లో చదువుల విషయానికొస్తే.. అమెరికా (19 శాతం మంది), యూకే (14 శాతం) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
⇒ ఆసక్తికరంగా 42 శాతం మంది తమ పిల్లలను భారతదేశంలోనే చదివిస్తామని వెల్లడించారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)