Breaking News

జూన్‌లో వర్షాభావం

Published on Sat, 05/27/2023 - 06:27

న్యూఢిల్లీ: ఫసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్‌ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది.

ఫసిఫిక్‌ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్‌ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్‌ ఓషన్‌ డిపోల్‌ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)