Breaking News

నెటిజన భారత్!

Published on Mon, 07/14/2025 - 04:14

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ . అవసరానికే కాదు వినోదానికీ ఈ ఉపకరణమే. మెసేజింగ్, కాలింగ్‌ యాప్స్, సామాజిక మాధ్యమాలు జీవితంలో భాగం అయిపోయాయి. ఇంకేముంది.. డేటా, అన్ లిమిటెడ్‌ ప్యాక్స్‌తో జనం సింపుల్‌గా మొబైల్‌తో ‘రీచార్జ్‌’ అవుతున్నారు. దేశంలో సగటున ఒక్కో నెల మొబైల్‌ కస్టమర్లు 21.53 జీబీ డేటాను ఆస్వాదిస్తున్నారు. మూడేళ్లలో సగటున నెలకు డేటా వినియోగం 44.59% పెరిగిందంటే నెట్‌లో ఏ స్థాయిలో విహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

దేశంలో వైర్‌లెస్‌ డేటా చందాదారుల సంఖ్య 2025 మార్చి నాటికి 93.9 కోట్లు. అంతకుముందు ఏడాదిలో ఇది 91.3 కోట్లు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల్లో  వైర్‌లెస్‌ వాటా ఏకంగా 95 శాతానికిపైగా ఉంది. ఇక వైర్‌లెస్‌ డేటా వినియోగం 1,94,774 పెటాబైట్స్‌ నుంచి ఏడాదిలో 17.46 శాతం అధికమై 2,28,779 పెటాబైట్స్‌కు ఎగసింది. అంటే 2,28,77,90,00,000 జీబీ అన్నమాట. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) ఇటీవల విడుదల చేసిన 2024–25 గణాంకాల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో ఎల్‌టీఈ (4జీ) వాటా 64.2 కోట్లు కాగా, 5జీ చందాదారుల సంఖ్య 24.4 కోట్లకు చేరింది. 100 మంది జనాభాలో ఇంటర్నెట్‌ వాడుతున్న వారు 68.63 శాతం ఉన్నారు. ఇంటర్నెట్‌ మార్కెట్లో ప్రైవేట్‌ కంపెనీల వాటా ఏకంగా 96 శాతం ఉంది. మిగిలినది ప్రభుత్వ టెలికం సంస్థలది. వైర్‌లెస్‌ డేటా వినియోగం ద్వారా ఒక్కో కస్టమర్‌ నుంచి టెలికం కంపెనీలకు ప్రతి నెలా సగటున 2023–24లో రూ.211.36 సమకూరితే.. 2024–25లో అది రూ.231.64కి పెరిగింది. 2021–22లో ఇది రూ.147.94 మాత్రమే.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)