రికార్డు స్థాయికి  దేశీయ రక్షణ ఉత్పత్తులు

Published on Sun, 08/10/2025 - 06:18

సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ తయారీ రంగం చరిత్ర సృష్టించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ అక్షరాలా రూ.1,50,590 కోట్లకు చేరింది. ఇది 2023–24లో నమోదైన రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. 2019–20లో ఉన్న రూ.79,071 కోట్లతో పోలిస్తే ఇది 90 శాతం పెరుగుదల. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణ ఉత్పత్తి విభాగం, డీపీఎస్‌యూలు, పబ్లిక్‌ సెక్టర్‌ తయారీ సంస్థలు, ప్రైవేట్‌ పరిశ్రమల కృషి ఫలితమే ఈ విజయమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. దేశ రక్షణ పారిశ్రామిక వేదిక బలపడుతున్నదనడానికి ఇది ఒక స్పష్టమైన సూచిక అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

పబ్లిక్‌–ప్రైవేట్‌ రంగాల వాటా
దేశీయ రక్షణ మొత్తం ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 77% ఉండగా, ప్రైవేట్‌ రంగం వాటా 23%గా ఉంది. ఇది గత ఏడాది 21% నుంచి పెరుగుదల నమోదైంది. కాగా పబ్లిక్‌ సెక్టర్‌ ఉత్పత్తి 16%, ప్రైవేట్‌ రంగ ఉత్పత్తి 28% పెరిగింది. దీర్ఘకాలిక విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం, స్వదేశీ ఉత్పత్తి (ఇండిజినైజేషన్‌)పై దృషిŠట్‌ సారించడం దేశీయ రక్షణ ఉతత్తి పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు 2024–25లో రక్షణ ఎగుమతులు రూ.23,622 కోట్లకు చేరాయి. ఇది 2023–24లో నమోదైన రూ.21,083 కోట్లతో పోలిస్తే రూ.2,539 కోట్లు (12.04%) ఎక్కువ. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేట్‌ రంగం పెరుగుతున్న భాగస్వామ్యం, ఎగుమతి అవకాశాల విస్తరణతో రాబోయే ఏళ్లలో రక్షణ తయారీ రంగం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ అంచనా వేస్తోంది.   

Videos

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)