Breaking News

సాయుధ బలగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం

Published on Mon, 12/15/2025 - 07:33

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో సీఆర్పిఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌), బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌), ఐటీబీపీ (ఇండో–టిబెటియన్‌ బోర్డర్‌ పోలీస్‌), ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమాబల్‌)లో కలిపి మొత్తం 3,239 మంది మహిళా సిబ్బంది నియమితులయ్యారు. 

2026లో మొత్తం 5,171 పోస్టుల భర్తీ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ఇటీవల వెల్లడించారు. కానిస్టేబుల్‌ ర్యాంకులో మహిళా సిబ్బంది నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


అందుకు అనుగుణంగానే సీఆర్పిఎఫ్‌లో 33 శాతం, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీలో 14 నుంచి 15 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సిబ్బందిని నియమిస్తున్నారు. మహిళా సిబ్బందికి సరైన పని వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 

వారికి ప్రత్యేకంగా బ్యారక్‌లు, టాయిలెట్లు, డ్రెస్‌ చేంజింగ్‌ రూంలు, క్రెచ్‌లు, డే కేర్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు ఈ బలగాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల వంటి అంశాల్లో ఫిర్యాదులపై అత్యంత గోప్యత పాటించడంతోపాటు సమస్య పరిష్కరించేలా అంతర్గత వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)